PM Modi spoke to MP Anil's daughter
mictv telugu

5 ఏళ్ల చిన్నారి సమాధానంతో పగలబడి నవ్విన ప్రధాని మోదీ

July 28, 2022

నిత్యం బిజీగా ఉండే ప్రధాని మోదీ బుధవారం పగలబడి నవ్వేశారు. అందుకు ఓ ఐదేళ్ళ చిన్నారి ఇచ్చిన సమాధానం కారణం. వివరాల్లోకెళితే.. ఉజ్జయిని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా పార్లమెంటులో కుటుంబంతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అనిల్ ఐదేళ్ల కూతురును పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ‘ముందుగా, నేనెవరో తెలుసా’? అని అడిగితే ‘తెలుసు, మీరు మోదీజీ. రోజూ టీవీలో మిమ్మల్ని చూస్తాను’ అని బాలిక సమాధానమిచ్చింది. తర్వాత ‘నేనేం పని చేస్తాను’? అని ప్రశ్నించగా, ‘మీరు లోక్‌సభలో ఉద్యోగం చేస్తారు’ అని చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. ప్రధాని మోదీ కూడా పగలబడి నవ్వుకున్నారు. అనంతరం పాపకు చాక్లెట్ ఇచ్చి పంపించేశారు. ఈ విషయాన్ని ఎంపీ అనిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు మరిచిపోలేనిది. ప్రపంచ నేత, విజయవంతమైన నాయకుడు, ప్రధాని మోదీని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అలాగే మోదీని కలిసిన ఫోటోలను విడుదల చేశారు.