PM MODi Teleangana Tour Tention
mictv telugu

రామగుండం రణగుండమవుతుందా?

November 9, 2022


తెలంగాణలో మోదీ టూర్ హీట్ పుట్టిస్తోంది. రామగుండం పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్ , లెఫ్ట్ పార్టీల నేతలు అంటున్నారు. విభజన హామీల సంగతి తేల్చాకే అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌ని నామ్ కే వాస్తే ఆహ్వానించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రధాని మోదీ టూర్ సజావుగా సాగుతుందా?అధికారిక పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?ప్రధాని మోదీకి ఈసారైనా సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారా?ఇప్పుడు తెలంగాణలో దీనిపై హాట్‌హాట్‌గా చర్చ నడుస్తోంది.

అగ్నిగుండమేనా?

ఈ నెల 12 ప్రధాని మోదీ రామగుండంలో పర్యటిస్తున్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్‌ని జాతీకి అంకితం చేస్తారు. ఆ తర్వాత బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. లక్షమందితో ప్రధాని సభ నిర్వహిస్తామని ఇప్పటికే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు వస్తున్న ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రిసీవ్ చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. పీఎంఓ కూడా ఈ మేరకు కేసీఆర్‌కు ఆహ్వానం పంపింది.ఈ ఆహ్వానాన్ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. మరోవైపు ప్రధాని మోదీ రామగుండం టూర్‌ని అడ్డుకుంటామని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అటు వామపక్షాలు, కార్మిక, విద్యార్థి సంఘాలు కూడా ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి.

ఈసారి కూడా అంతేనా?

ప్రధాని మోదీ టూర్‌కు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఆర్ఎఫ్సీఎల్ కార్యక్రమానికి డుమ్మాకొడుతారని తెలుస్తోంది. గతంలో కూడా మూడు పర్యటనలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కర్నాటక టూర్ వెళ్లారు. ముచ్చింతల్ రామానుజ విగ్రహావిష్కరణ సమయంలో జ్వరంతో గైర్హాజరయ్యారు. అప్పుడు ప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. అంతకు ముందు కూడా ఓ సారి ఇలాగే జరిగింది. ఇఫ్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం ఓపెనింగ్‌కు ఆహ్వానించినా వెళ్లారని తెలుస్తోంది.

ఎందుకిలా?

ఏ రాష్ట్రముఖ్యమంత్రైనా ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సింది. కేంద్రంతో ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆహ్వానించాల్సిందే. గతంలో బెంగాల్ వెళ్లినప్పుడు ప్రతిసారీ మమతబెనర్జీ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అలాగే మహారాష్ట్రలో ఉద్దవ్ థాకరే అదే సంప్రదాయాన్ని పాటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వీరికి భిన్నం. ప్రధాని మోదీ అధికారిక పర్యటనలన్నింటికీ దూరంగా ఉంటున్నారు. రెండు, మూడేళ్లుగా కేంద్రంతో రాష్ట్రానికి సఖ్యత లేదు.రాను రాను ఇది దూరం పెంచేస్తుంది.జాతీయ స్థాయిలో మోదీ తీరుని కేసీఆర్ ఎండగడుతున్నారు. కేంద్రంపై పోరాటం కోసం బీఆర్ఎస్‌ని తెరపైకి తెచారు.

టీఆర్ఎస్ వాదన ఏంటంటే
ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏంటని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలు చెల్లించాలని కోరుతోంది. విభజన హామీల సంగతి తేల్చాలని పట్టుబడుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సజావుగా సాగేనా?

ప్రధాని రామగుండం టూర్ పర్యటన టెన్షన్ పుట్టిస్తోంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏలాంటి ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని టూర్‌ను అడ్డుకుంటామన్న టీఆర్ఎస్ ,వామపక్షాల హెచ్చరికల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర శ్రేయస్సుకోసం వస్తున్న ప్రధానిని అడ్డుకోవడం భావ్యం కాదంటోంది. రాజకీయాలు ఉంటే బయటచూసుకోవాలని ఆ పార్టీ నేతలు హితువు పలికారు.