PM Modi to launch 5G services on Saturday
mictv telugu

5జీ సేవలు అందుబాటులోకి.. ప్రధాని మోడీ చేతుల మీదుగా

September 30, 2022

PM Modi to launch 5G services on Saturday

దేశంలో 5జీ విప్లవానికి అంతా సిద్ధమైంది. రేపటి నుంచి 5జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సర్వీసులు ఆవిష్కరించబోతున్నారు. అక్టోబర్ 1న దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ కార్యక్రమంలో 5జీ సేవలను అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. దీంతో టెలికం యూజర్లు హై స్పీడ్ ఇంటర్నెట్‌తో కూడిన 5జీ సేవలు అందబాటులోకి రానున్నాయి. శనివారం జరగబోయే ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొటారని తెలుస్తోంది. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా చైర్మన్లు ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు.

మొబైల్‌ యూజర్లకు వేగవంతమైన ఇంటర్నెట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, వైద్య, పారిశ్రామిక రంగాల్లో 5జీ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటికే ఈ మూడు ప్రైవేట్ టెలికం సంస్థలు.. వివిధ రంగాల్లో 5జీని ఉపయోగించేలా టెక్నాలజీలను డెవలప్‌ చేశాయి. ఇప్పటికే దీపావళి కల్లా 5జీని అందుబాటులోకి తెస్తామని జియో వెల్లడించగా.. ఈనెలలో ఎప్పుడైనా 5జీని ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌ చెప్పింది. మరోవైపు ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఈనెలలో 5జీని తీసుకురావడం కష్టంగానే ఉంది. అక్టోబర్‌లో 5జీ నెట్‌వర్క్‌ను కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో జియో, ఎయిర్‌టెల్ లాంచ్ చేయనున్నాయి. క్రమంగా మిగిలిన నగరాలకు విస్తరిస్తాయి. మొత్తంగా రెండేళ్లలో దేశమంతా 5జీ సేవలను అందించాలని టెలికం సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ సంస్థలు వెల్లడించాయి.