వావ్..  చెన్నై నుంచి అండమాన్‌కు ఫైబర్ కేబుల్  - MicTv.in - Telugu News
mictv telugu

వావ్..  చెన్నై నుంచి అండమాన్‌కు ఫైబర్ కేబుల్ 

August 10, 2020

PM Modi to Launch Submarine Fibre Cable  .

అండమాన్ నికోబార్ ప్రజల స్వప్నాన్ని ప్రధాని మోదీ నెరవేర్చారు. సముద్ర గర్భం నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) ద్వారా డేటా సేవలను అందించే ప్రాజెక్టును ఆయన సోమవారం ప్రారంభించారు. చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచి ప్రపంచ దేశాలతో అండమాన్ దీవులను అనుసంధానం చేసేలా ఓఎఫ్‌సీ ప్రాజెక్టును చేపట్టారు. సముద్రం నుంచి ఓఎఫ్‌సీ వ్యవస్థను ఏర్పాటు చేయడం  దేశంలో ఇదేమొదటిసారి కావడం విశేషం. 

చెన్నై నుంచి పోర్టు బ్లేయర్ వరకు  2,312 కిలోమీటర్ల దూరం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.  2018, డిసెంబర్ 30న శంఖుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తి కావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల టూరిజం కూడా బాగా పెరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కాగా రూ. 1224 కోట్ల వ్యవయంతో దీన్ని ప్రారంభించారు. సముద్రం గర్భం నుంచి ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాలను అండమాన్‌ వరకు అందేలా రూపొందించారు. బీఎస్ఎన్ఎల్, టీసీఐఎల్ కంపెనీలు దీన్ని పూర్తి చేశాయి. ఓఎఫ్‌సీ వ్యవస్థను  సముద్ర గర్భం నుంచి ఏర్పాటు చేయడం సవాళ్లతో కూడుకున్న  పని. అయినా కూడా పటిష్టమైన నాణ్యతో దీన్ని పూర్తి చేశారు.