Pm-Kisan: రైతులకు శుభవార్త....నేడు పీఎం-కిసాన్ 13వ విడత నిధులను విడుదల చేయనున్న ప్రధాని మోదీ..!! - Telugu News - Mic tv
mictv telugu

Pm-Kisan: రైతులకు శుభవార్త….నేడు పీఎం-కిసాన్ 13వ విడత నిధులను విడుదల చేయనున్న ప్రధాని మోదీ..!!

February 27, 2023

పీఎం కిసాన్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త అందించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. హోలీకి ముందే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. 13వ విడతలో భాగంగా ఫిబ్రవరి 27, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ విడతలో 9 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.16,800 కోట్లు జమ చేస్తారు. ఈ కార్యక్రమం కర్ణాటకలోని బెలగావిలో జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొంటారు. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ కార్యక్రమానికి PM-KISAN, జల్ జీవన్ మిషన్ లబ్దిదారులతో సహా లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు.

చివరి విడత అక్టోబర్‌లో విడుదలైంది:

ఈ పథకం కింద 11, 12వ విడతలు గతేడాది మే, అక్టోబర్‌లో ఇచ్చారు. నేడు 13వ విడత నిధులను మోదీ డైరెక్టుగా రైతులకు అకౌంట్లోకి విడుదల చేయనున్నారు. రైతులను ఆదుకోవడానికి, వారి జీవనోపాధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి ప్రభుత్వం తన నిబద్ధతను కొనసాగిస్తుంది. PM-KISAN పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించింది. ఈ తాజా విడత రైతులకు మరింత ప్రోత్సాహకంగా ఉండనుంది.