రైతుల కోసం కేంద్రం అందిస్తున్న పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13 విడత డబ్బులను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధిని విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోమవారం అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఈ విడత ద్వారా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు విడుదల అవుతాయని అంచనా. ఇక ఈ – కేవైసీ చేసిన రైతుల ఖాతాల్లోకే డబ్బులు వస్తాయని తెలిసిందే. ఇంతకుముందే ప్రభుత్వం ఈ – కేవైసీ చేయించుకోవాలని రైతులకు సూచించింది. అయితే ఈ – కేవైసీ వచ్చిన నాటి నుంచి లబ్దిదారుల సంఖ్య తగ్గడం గమనార్హం.