దేశ ప్రజలకు ప్రధాని మోదీ వీడియో సందేశం! - MicTv.in - Telugu News
mictv telugu

దేశ ప్రజలకు ప్రధాని మోదీ వీడియో సందేశం!

April 2, 2020

PM Modi to share video message tomorrow

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెల్సిందే. వీడియో కాన్ఫరెన్స్ తరువాత ఆయన చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తి రేపుతోంది. రేపు ఉదయం 9 గంటలకు భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకోబోతున్నా..అంటూ ఇంగ్లీషు, హిందీ భాషల్లో మోదీ ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ వీడియో సందేశంలో ఏం చెబుతారో అని.. ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తునారు. లాక్ డౌన్ సమయాన్ని పెంచుతారా? లేదా తాగిస్తారా? లేదా అంచల వారీగా లాక్ డౌన్ ను ఎత్తేస్తారా ? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.