PM Modi to watch this kannada blockbuster film kantara
mictv telugu

బ్లాక్ బాస్టర్ మూవీని చూడబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ

October 27, 2022

కన్నడ సెన్సేషన్ కాంతారను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అతి త్వరలో వీక్షించనున్నారు. ఈ మేరకు పీఎం ఆఫీస్‌ ఏర్పాట్లని ప్రారంభించినట్లు తెలుస్తోంది. విడుదలైన అన్ని భాషలో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది కాంతార. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రంలో భూతకోల సంస్కృతిని తెరపై దర్శకుడు రిషబ్ శెట్టి చూపెట్టిన అద్భుత విధానానికి ఆడియన్స్ ఎలాగైతే ఫిదా అయిపోయారో.. ప్రధాని సైతం కాంతార చూడాలని ఎనలేని ఆసక్తి కనపరుస్తున్నారట. ఈ సినిమాలో నటించిన రిషబ్ శెట్టితో కలిసి మోడీ ఈ చిత్రాన్ని చూస్తారని తెలుస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 14వ తేదీన ప్రత్యేక స్క్రీనింగ్‌లో ప్రధాని మోదీ కాంతారను చూడనున్నట్టు.. ఈ మేరకు త్వరలోనే ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుండి అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని తుళునాడులోని ఆదివాసీల ఆచారాల కథాంశంతో కాంతార తెరకెక్కింది. దాంతో మన పూర్వీకుల సాంప్రదాయాలని గొప్పగా చూపెట్టిన వైనంపై హిందుధార్మిక వేత్తలు ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హిందు దేవుళ్ళపై సినిమాలు రావటం.. ప్రేక్షకులు ఆదరించటం శుభపరిణామమని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో హిందుత్వ ప్రచారం మరింత పెరగాలన్న ఉద్దేహాసంతో మోదీ సైతం ఈ సినిమాని వీక్షించనున్నారని అంటున్నారు.