PM MODi tour.Will Modi Talk About Kcr?
mictv telugu

సీఎం కేసీఆర్‌ని.. ప్రధాని మోదీ టచ్ చేస్తారా?

November 12, 2022

PM MODi tour.Will Modi Talk About Kcr?

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ని జాతికి అంకితం చేస్తారు.రామగుండం వెళ్లే ముందు బేగంపేట ఎయిర్ పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతారు. ఈ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నారు?తెలంగాణ సీఎం కేసీఆర్‌ని టచ్ చేస్తారా? ఫామ్‌హౌస్ ఫైల్స్ పై ఏమైనా స్పందిస్తారా?కేసీఆర్ సర్కార్ పై విమర్శల డోస్ పెంచుతారా? లేదంటే తెలంగాణ సర్కార్ ప్రస్తావన లేకుండానే గతంలోలాగా ముగిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఉత్కంఠరేపుతోంది. ప్రధానికి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారా?రామగుండం ఆర్ఎఫ్సీఎల్ కార్యక్రమానికి వెళ్తారా అనేది డౌటే.ఎందుకంటే గతంలో మూడు,నాలుగు సార్లు ప్రధాని మోదీ రాష్ట్రానికొచ్చినప్పుడు కేసీఆర్ వెళ్లి స్వాగతం పలకలేదు. ఈ సారి కూడా అంతేనని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. గతంలో పీఎంవో నుంచి ఆహ్వానం లేదని చెప్పుకున్నారు. కానీ ఈసారి పీఎంవో నుంచి కేసీఆర్ స్పష్టమైన ఇన్విటేషన్ వచ్చింది. సీఎం కేసీఆర్ కూడా రాజకీయాలు పక్కనబెట్టి రామగుండం వస్తే బాగుంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్ ,దాని అనుబంధ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీన్ని బట్టి రామగుండానికి సీఎం కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో వెళ్లరని తెలుస్తోంది.

ఇక మిగిలింది బేగంపేట పబ్లిక్ మీటింగ్. ఈ సభలో మోదీ ఏం మాట్లాడుతారనేది ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్‌పై గతంలో లాగే విమర్శలు చేస్తారా? ఫామ్ హౌజ్ ఫైల్స్ విషయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. గతంలో బేగంపేట సభ నుంచే మోదీ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. మాట్లాడుతారకున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ ..కేసీఆర్‌ని పల్లెత్తుమాట అనలేదు. ఇప్పుడు ఈ సభలో కేసీఆర్ సర్కార్ పై మాట్లాడుతారని తెలుస్తోంది. కేసీఆర్ లెవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానమిచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ రాజకీయాల్ని ప్రస్తావిస్తారని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు.