దేశవ్యాప్తంగా మహాత్ముడికి నివాళి.. రాజ్‌ఘాట్‌కు ప్రధాని  - MicTv.in - Telugu News
mictv telugu

దేశవ్యాప్తంగా మహాత్ముడికి నివాళి.. రాజ్‌ఘాట్‌కు ప్రధాని 

October 2, 2020

PM Modi Tribute to Gandhi Jayanti

దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఆయనకు నివాళ్లు అర్పిస్తూ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఢిల్లీలోని  సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ చూపిన మార్గం, సేవలను కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇవాళ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో ఆయనకు నివాళ్లు అర్పించారు. విజయ్‌ఘాట్ వద్ద  శ్రద్ధాంజలి ఘటించారు.