PM MODI Vizag Tour..Jagan Super Strategy
mictv telugu

విశాఖలో మోదీ సభ..జగన్ ప్లాన్ ఇదే..!

November 12, 2022

విశాఖకు ప్రధాని మోదీ వచ్చారు. నాలుగుమాటలు మాట్లాడి వెళ్లిపోయారు.అభివృద్ధి కోణమే తప్ప రాజకీయ ఎజెండాలేమీ లేవన్నారు జగన్. అంతా నిజమే.కానీ లోతుగా పరిశీలించి చూస్తే విశాఖ వ్యూహం స్పష్టంగా తెలుస్తోంది. జగన్‌కు అత్యంత ఇష్టమైన నగరం విశాఖ. ఎందుకంటే ఆయన దృష్టిలో ఇదే పరిపాలన రాజధాని. భవిష్యత్‌లో ఎలాగైనా మూడు రాజధానుల బిల్లుని మళ్లీ తెచ్చి అధికారముద్ర వేయాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విశాఖను ఎప్పుడూ జనంనోళ్లల్లో ఉండేలా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని లెవదేశారు. ఇప్పుడు మోదీ సభని గ్రాండ్‌గా నిర్వహించారు. లక్షలమందితో మోదీని మెప్పించారు. ప్రధాని మోదీ స్పీచ్‌లో విశాఖ ప్రస్తావన ప్రధానంగా ఉంది.సీఎం జగన్ నయా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?

మోదీ సభ..అంతకుమించి….

అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని పిలిచి అమరావతిలో హడావుడి చేశారు. ఇప్పుడు అంతకుమించి సీఎం జగన్ విశాఖలో మోదీ సభను నిర్వహించారు. రెండింటికి తేడా ఒక్కటే.. అప్పుడు అమరావతి అధికారిక రాజధాని…ఇప్పుడు విశాఖ పరిపాలన రాజధాని. పైకి అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు..లోలోపల మ్యాటర్ వేరేగా ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. ఏపీ మ్యాప్‌లో విశాఖను టాప్‌లో ఉండేలా జగన్ ప్రయత్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ సభలో లెవనెత్తారు.

గ్రేట్ విశాఖ..మోదీ మాటల్లో…

ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏపీ వాసులకు నమస్కారం. అల్లూరి 125 జయంతి ఉత్సవాలకు ఇక్కడకు వచ్చానంటూ తెలుగులో మాట్టాడారు. ” భారత దేశంలోనే విశాఖ ప్రత్యేక నగరం. విశాఖ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నాం. షిప్పింగ్ హార్బర్‌ని ఆదునీకరిస్తున్నాం.రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులతో విశాఖవాసుల ఆకాంక్షల్ని నెరవేరుస్తున్నాం. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధికి దోహదపడుతాయి. ఇప్పటికీ విశాఖ వ్యాపార కేంద్రంగా మారింది. మౌలిక వసతుల కల్పనలో మా విజన్ ఏంటో ఇవాళ్టి ప్రాజెక్టులు స్పష్టం చేస్తున్నాయి.దేశంలోనే విశాఖపట్నం విశేషనగరం.పోర్టు ఆధారిత అభివృద్ధికోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని ప్రధాని మోదీ అన్నారు. సభకు ముందు ఐదు ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రెండు ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేశారు

జగన్ క్లియర్ కట్‌గా

ప్రధాని మోదీ ముందు జగన్ క్లియర్‌గా ఏపీ విజ్ఞప్తుల్ని ఉంచారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన తెరపైకి తెచ్చారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని, పోలవరానికి జాతీయహోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. ప్రధాని ముందు మాట్లాడింది పది నిమిషాలలోపే అయినా జగన్ సూటిగా కీలక అంశాలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. “విశాఖ సభ రాజకీయాలకు అతీతం. ఇందులో రాజకీయ ఎజెండాలేమి లేవు. కేంద్రం, బీజేపీ, మోదీతో మాకున్న అనుసంభం రాజకీయాలకు అతీతం.విశాఖ రైల్వే జోన్ , పోలవరం ప్రాజెక్ట్ , విశాఖ స్టీల్ ప్లాంట్ , ఏపీకి ప్రత్యేక హోదా విజ్ఞప్తుల్ని పరిశీలించాలి. ఎనిమిదేళ్లక్రితం దెబ్బతిన్న రాష్ట్రం ఇంకా కోలుకోలేదు రాష్ట్రానికి కేంద్రం సహాయ, సహకారాలు మరింత అవసరం”జగన్ అన్నారు.

మొత్తానికి సక్సెస్

వైసీపీ ఊహించినట్టుగానే విశాఖలో ప్రధాని సభ విజయవంతం అయింది. లక్షలమందిని ఈ సభకు తీసుకొచ్చారు.దేశంలో విశాఖ పేరు మార్మోగేలా చేశారు. భవిష్యత్‌లో విశాఖను ఏపీలో టాప్ లెవల్లో చూపెట్టే విధంగా ప్రయత్నించారు. రూ.10వేల కోట్ల అభివృద్ధి పనులు…సుందర నగరంగా మార్చబోతున్నాయని వైసీపీ అంచనా వేస్తోంది.అనుకున్నట్టే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని,,ఇందుకోసం కేంద్రాన్ని ఒప్పించే అడుగులు పడ్డాయని జగన్ భావిస్తున్నారు.