PM MODI Waring to TRS Govt
mictv telugu

తెలంగాణలో మోదీ విశ్వరూపం

November 12, 2022

తెలంగాణ టూర్‌లో ప్రధాని మోదీ విశ్వరూపం చూపించారు.టీఆర్ఎస్ సర్కార్ పై బేగంపేట సభలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండా పదునైనా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల్ని తిడితే ఊరుకునేది లేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమన్నారు. అవినీతిపరుల్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని, ప్రజల జొలికే వస్తే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. మోదీ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి?టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ ముదురుతుందా?తెలంగాణలో ఏం జరగబోతోంది?

అన్యాయం చేస్తే…

తెలంగాణకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అవినీతి, కుటుంబపాలన అంతమే లక్ష్యమన్నారు.”అభివృద్ధి వ్యతిరేకుతో టీఆర్ఎస్ జతకట్టింది. అంధ విశ్వాస శక్తులు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. అవినీతి సహించనందుకే కొందరు మోడీని తిడుతున్నారు.నన్ను తిట్టే వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తిట్టను నేను పెద్దగా పట్టించుకోను. నన్ను, బీజేపీని ఎంత తిట్టినా ఫర్వాలేదు.కానీ తెలంగాణ ప్రజల్ని అంటే ఊరుకునేది లేదు.వారికి అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అవినీతి, కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి తొలి శత్రువులు. తెలంగాణలో బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయి” అని మోదీ అన్నారు.

కమల వికాసమే

మునుగోడు ఫలితంపై మోదీ మాట్లాడారు. ఒక అసెంబ్లీ సీటు కోసం ప్రభుత్వం మొత్తం మునుగోడుకు పోయిందన్నారు. తెలంగాణలో అంధకారం ఎక్కువరోజులు ఉండదు. మునుగోడులో కమలం వికసించింది. వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటి చెప్పారని మోదీ అన్నారు.

కార్యకర్తలకు బూస్ట్

బీజేపీ కార్యకర్తలకు బూస్ట్ నిచ్చే ప్రయత్నం మోదీ చేశారు. తెలంగాణ కార్యకర్తల్ని చూసి ఎంతో స్ఫూర్తి పొందానని మోదీ అన్నారు. తెలంగాణ బీజేపీ కేడర్ బలమైందని, ఎవరికీ భయపడదని పొగిడారు. అణచివేత వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని తనలో కొత్త ఉత్సాహన్ని నింపారన్నారు.

అదే స్పీచ్..కొంచెం కొత్తగా…

గతేడాది బేగంపేటలో ప్రధాని మోదీ సభ జరిగింది. అచ్చం ఆ సభలోలాగే మాట్లాడారు. కాకపోతే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు…ఇప్పుడు మునుగోడు ఫలితం..మిగతా సేమ్ టు సేమ్ డైలాగ్ లు దంచికొట్టారు. ఫామ్‌హౌస్ పైల్స్ ప్రస్తావన లేదు. ప్రోటోకాల్స్ ఉల్లంఘణలు గుర్తు చేయలేదు. రాజ్ భవన్‌ని వివాదాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలపై మాట్లాడలేదు. ఈ మధ్య కేసీఆర్ లెవనెత్తిన అంశాలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్లు ఇస్తారని అందరూ ఎదురుచూశారు. ఇదేది లేకుండా మోదీ బేగంపేట సభ ముగిసింది.

నోట్
మోదీ , కేసీఆర్ పంపిన ఫొటోలు ఉన్నాయి. అవే వాడాలి.