కోవిడ్ బారినుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అంతకు ముందు సోనియాకు కోవిడ్ సోకిందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఆమెకు తేలికపాటి జ్వరం వచ్చిందని, ప్రస్తుతం ఆమె సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా తెలియజేశారు. వైద్యుల సలహామేరకు ఆమె సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారని తెలిపారు.
కాగా ఈ నెల 8న నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. దీనికి సంబంధించి నిన్ననే వారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. రాహుల్ ఈ నెల 2న, సోనియా ఈ నెల 8న తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ సమన్లు పంపింది. అయితే రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల 5న హాజరయ్యేందుకు అనుమతినివ్వాలని కాంగ్రెస్ పార్టీ ఈడీని కోరింది.
Wishing Congress President Smt. Sonia Gandhi Ji a speedy recovery from COVID-19.
— Narendra Modi (@narendramodi) June 2, 2022