PM Modi,ArunachalPradesh,First Greenfield Airport,Counter
mictv telugu

మీ కళ్లజోడు మార్చుకోండి

November 19, 2022


విపక్షాలకు ప్రధాని నరేంద్రమోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి విషయాన్ని ఎన్నికల కోణంలోంచి చూస్తున్నారన్నారు. అలాంటివాళ్లు పాత కళ్లద్దాలు మార్చుకోవాలని హితవు పలికారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధంలో దూసుకుపోతుందన్నారు.

డబుల్ ధమాకా


2019 ఫిబ్రవరిలో డోనీ పోల్ ఎయిర్ పోర్ట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అదే ఏడాది మేలో ఎన్నికలు వచ్చాయి. ఓటు బ్యాంక్ కోసమే శంకుస్థాపన చేశారని ప్రధాని మోదీపై విపక్షాలు విమర్శలు చేశాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఆ ఎయిర్ పోర్ట్‌ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పట్లో విపక్షాలు చేసిన ఆరోపణలకు మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతీదీ పాత కళద్దాలతో చూడటం విమర్శకులకు అలవాటైందని, కేవవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడకొచ్చానని విమర్శలు చేశారు. ఎప్పటికీ విమానాశ్రయం నిర్మాణం జరగదన్నారు.ప్రతీదీ రాజకీయ కోణంలో చూసే అలాంటోళ్లకు ఇప్పుడు ఎయిర్ట్ పోర్ట్ ప్రారంభించడం చెంపపెట్టు అని ప్రధాని మోదీ అన్నారు. “డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి పథంలో అరుణాచల్ పయనిస్తోంది. పాత కళ్లద్దాలు తొలిగించాలని వారికి చెబుతున్నా.రెట్టించిన ఉత్సాహంతో దేశం అభివృద్ధపథంలో దూసుకెళ్తుంది. ఇప్పటికైనా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలి”అని మోదీ అన్నారు.

ఈశాన్యంలో టూరిజం

డోనీ పోలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ 690 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనికోసం రూ.645 కోట్లు ఖర్చు చేశారు. గంటకు 2వందల మంది ప్రయాణికుల్ని హ్యాండిల్ చేయగలిగే ఎనిమిది చెక్ కౌంటర్లు నిర్మించారు. 2300 మీటర్ల రన్ వే ఉంది. బోయింగ్ 747 విమానాల ల్యాండింగ్ , టేకాఫ్‌కు అనుకూలంగా ఉంటుంది. డోనీ పోలో ఎయిర్ పోర్ట్ తో అరుణాచల్‌ప్రదేశ్‌లో మొత్తం మూడు విమానాశ్రాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాల ఎయిర్ పోర్టుల సంఖ్య 16కు చేరింది. డోనీ పోలో అంటే సూర్యుడు,చంద్రుడు అని అర్థం. ఈటానగర్ హోలింగ్‌లో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తో ఈశాన్యంలో టూరిజం డెవలప్ కానుంది.