ప్రధాని నరేంద్ర మోదీకి భారత్ లోనే కాదు ప్రపంచం లో తిరుగులేదు. విశ్వసనీయతలో వరల్డ్ లోనే నెంబర్ వన్ గా నిలిచారు. 73 శాతం మంది భారతీయులు నమో ప్రభుత్వం ఎక్కువగా విశ్వాసం ఉంచితే…అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కార్ పై కేవలం 30 శాతం మంది విశ్వాసం ఉంచారు. ఎంతైనా మన మోదీ గ్రేట్ కదా..నోట్ల రద్దు తర్వాత జనం ఇబ్బందులు పడుతున్నా…మద్దుతు ధరలు లేకున్నా… సర్వేలు ఆహోఓహో మోదీ అంటున్నందుకు…ఇంతకీ సర్వే చేసిందెవరో తెలుసా..
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ప్రభుత్వాలపై ఓఈసీడీ అనే సంస్థ నిర్వహించింది. ప్రస్తుత ప్రభుత్వం స్థిరంగా ఉండగలదో లేదో అనే దాని పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేసింది. అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు ప్రభుత్వం ప్రజలను రక్షించగలదా? లేదా ప్రజల సేవలను సమర్థంగా నిర్వహించగలుగుతుందా అనే తదితర అంశాలపై ఫోకస్ చేసింది.
ఈ సర్వే లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజలు అత్యంత విశ్వాసం కలిగి ఉన్నట్లు సర్వే తేల్చింది. దాదాపు 73శాతం మంది ఓటేశారు. అంతేకాదు ఎన్డీయే ప్రభుత్వం ప్రపంచంలోనే విశ్వసనీయమైనదిగా కూడా నిలిచింది. అగ్రరాజ్యమైన అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై కేవలం 30శాతం మంది విశ్వాసమే చూరగొంది.
భారత్ తర్వాతి స్థానంలో కెనడా ప్రభుత్వం ఉంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై 62శాతం మంది కెనడియన్లు విశ్వాసం ఉంచారు. తర్వాతి స్థానంలో టర్కీ(58శాతం), రష్యా(58శాతం), జర్మనీ(55శాతం) ప్రభుత్వాలు ఉన్నాయి. గతేడాది బ్రెగ్జిట్ సంక్షోభంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న బ్రిటన్ థెరిస్సా మే ప్రభుత్వంపై 41శాతం మంది ప్రజలు విశ్వాసం ఉంచడం హైలైట్. అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై కారణంగా ఆ దేశ ప్రభుత్వంపై కేవలం 25శాతం మంది ప్రజలే నమ్ముతారు.
ఎంతైనా మన మోదీ సార్ గ్రేట్ ..ఇంట ఎలా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచాన్ని గెలిచాడు. ఊరేకే విదేశాలకు వెళ్లి వందల కోట్లు ఖర్చు చేస్తారని విమర్శిస్తున్న వాళ్లు ఇప్పుడేం సమాధానం చెబుదారో…