మోదీ తమ్ముడికి కోపమొచ్చింది.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ తమ్ముడికి కోపమొచ్చింది.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

May 15, 2019

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ నిరసన బాట పట్టారు. తన భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.. జైపూర్‌-అజ్మేర్‌ జాతీయ రహదారి మార్గంలోని బగ్రు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆయన ధర్నాకు దిగారు.

PM Modi's brother prahlad accuses Jaipur police of not providing him proper security.

ప్రధాని కుటుంబ సభ్యుడు కావడంతో ప్రహ్లాద్ మోదీకి ఇద్దరు పీఎస్‌వో(వ్యక్తిగత భద్రతా అధికారులు)లను ప్రభుత్వం కేటాయించింది. ప్రహ్లాద్ ఎక్కడికైనా వెళ్లాలంటే వారితో కలసి ఒకే వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది. అయితే అది తన కారులో స్థలం లేదని, తన కుటుంబ సభ్యులతో కలసి ప్రయాణించాల్సి ఉంటుందని ప్రహ్లాద్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన భద్రతా సిబ్బందిని ఎట్టిపరిస్థితిల్లోనూ తన వాహనంలో తీసుకెళ్లనని, వారికి మరో పోలీసు బండిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తన కారులో పోలీసులు తీసుకెళ్లనని అయితే ఈ విషయం తమ పరిధిలో లేదని పోలీసులు చెబుతున్నారు. గంట ధర్నా చేసిన ప్రహ్లాద్ తర్వాత పోలీసులు నచ్చజెప్పడంతో శాంతిచారు.