హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ వైపు వెళ్లకండి.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ వైపు వెళ్లకండి..

July 3, 2022

హైదరాబాద్‌లో నేడు బీజేపీ బహిరంగ సభకు పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో జరగబోయే సభకు నాలుగు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు.

HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్‌పోర్టు – పరేడ్ గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ ప్రధాన రహదారుల్లో ఆంక్షలు విధించారు. టివోలి X రోడ్ నుంచి ప్లాజా X రోడ్ మధ్య రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉండనున్నాయి.

MG రోడ్, RP రోడ్, SD రోడ్లలో, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్లు, రోడ్లలో ప్రయాణాలపై ఆంక్షలు విధించనున్నారు. పంజాగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్‌టీసీ X రోడ్, మీదుగా చిలకలగూడ నుంచి ఫ్లాట్ ఫారం నంబర్ 10 ద్వారా దారిని మళ్లించనున్నారు. ఉప్పల్ వైపు నుంచి నారాయణగూడ, ఆర్‌టీసీ X రోడ్, మీదుగా చిలకలగూడ నుంచి ప్లాట్ ఫారం నంబర్ 10 నుంచి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ప్యాట్ని, పారడైస్, బేగంపేట్ దారులలో ఆంక్షలు ఉంటాయి. ఉప్పల్ వైపు నుంచి పంజాగుట్ట/అమీర్‌పేట్‌ వెళ్లే ప్రయాణికులు తార్నాక, రైలు నిలయం రోడ్‌ను నివారించి ఆర్.ట్.సి. X రోడ్ నుంచి లక్డికాపూల్ మీదుగా వెళ్లాలని పోలీసులు  సూచిస్తున్నారు.