ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు, ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ దామోదరదాస్ మోడీ అస్వస్థతకు గుర్యయారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రహ్లాద్ మోడీని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు మంగళవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రహ్లాద్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కొంతకాలంగా ప్రహ్లాద్ మోడీ భారతదేశం మొత్తం ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు.
ఆయన కుటుంబ సమేతంగా కన్యాకుమారి, మధురై, రామేశ్వరం ఆలయాలను సందర్శిస్తున్నారని (జాతీయ మీడియా వర్గాల ప్రకారం) సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీకి నలుగురు సోదరులు సోమ మోదీ, అమృత్ మోదీ, పంకజ్ మోదీ, ప్రహ్లాద్ మోదీ. సోదరి వాసంతి మోదీలు. ప్రస్తుతం కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన ప్రహ్లాద్ మోదీ నాలుగో వ్యక్తి. మోదీ కంటే రెండేళ్లు చిన్నవాడు.
ప్రహ్లాద్ అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అదే నగరంలో ఆయనకు టైర్ షో రూమ్ కూడా ఉంది. కాగా, గతేడాది డిసెంబర్ 27న కర్ణాటకలోని మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో వీరంతా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందారు.