నమో మీరు కేక...కానీ మీ వార్నింగ్ వెరీ లేట్..! - MicTv.in - Telugu News
mictv telugu

నమో మీరు కేక…కానీ మీ వార్నింగ్ వెరీ లేట్..!

June 30, 2017

ఓవరాక్షన్ చేసే గో సంరక్షకుల తాట తీయాల్సిందే. ఎస్ రెచ్చిపోతే బొక్కలో తోయాల్సిందే. ప్రధాని మోదీ వార్నింగ్ సూపర్. కానీ చాలా లేట్ గా స్పందించారు. కొంచెం ముందే స్పందించి ఉంటే కొందరి ప్రాణాలు దక్కేవి. సర్కార్ కూ చెడ్డపేరు వచ్చేది కాదు. ఇన్నాళ్లు గో రక్షకుల పేరిట అరాచకాలు చేస్తున్న వారిని ఎందుకు పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చాక మైనార్టీల మీద దాడులు పెరిగిపోయాయనే భావన ఈ మధ్య కొన్ని వర్గాల్లోపెరుగుతోంది. దీన్ని కవరింగ్ చేసేందుకే ప్రధాని మోదీ ఇలా మాట్లాడారా…? లేట్ గా వార్నింగ్ ఇచ్చినా గో రక్షక్ దళ్ ఆగడాలకు కళ్లెం వేస్తారా..?

కొంతకాలంగా గో రక్షకుల పేరిట కొందరు సామూహిక హత్యలు, హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. కబేళాలకు అక్రమంగా గోవుల్ని తరలిస్తున్నారంటూ కొందరినీ కొట్టి చంపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అరాచాకాలకు దిగారు. ఈ ఘటనలపై వీటిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి బాధాకరమైన విషయాలపై కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నానంటూ.. ప్రధాని తొలిసారి గోరక్షకులపై మాట్లాడారు. ‘‘మనం శాంతియుతమైన దేశంలో ఉన్నాం. గాంధీ పుట్టిన దేశం మనది. మనం దీన్ని ఎందుకు మర్చిపోతున్నాం? గో సంరక్షణ గురించి మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే కంటే మాట్లాడగలిగే వారు ఎవరూ లేరు. కాబట్టి అందరం కలిసి స్వాతంత్ర్య సమర యోధులు గర్వించేలా దేశాన్ని తీర్చిదిద్దుదాం’’ అని మోదీ అన్నారు. ‘గో రక్షకుల’ పేరిట మనుషులను కొట్టిచంపుతున్న వారిని హెచ్చరించారు. గోవులను కాపాడుతున్నామంటూ మనుషులను చంపడం ఆమోదయోగ్యం కాదన్నారు.
ప్రధాని మోదీ ఈ వార్నింగ్ ఓ ఆర్నెళ్ల ముందు ఇస్తే కొందరి ప్రాణాలైనా దక్కేవి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే గో రక్షుకులు భయపడేవారు. అరాచాకాలకు దిగే వారు కాదు. చూడాలి ప్రధాని వార్నింగ్ తోనైనా కామ్ గా ఉంటారో..