నా మద్దతు ఎప్పుడూ మోదీకే.. కాజల్ - MicTv.in - Telugu News
mictv telugu

నా మద్దతు ఎప్పుడూ మోదీకే.. కాజల్

March 16, 2018

నటి కాజల్ అగర్వాల్   ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ  పథకాలని ప్రశంసిస్తూ తన మద్దతు ప్రకటించింది. మహిళా దినోత్సవం సందర్బంగా స్వయంగా దేశ ప్రధాని కాజల్‌కు మహిళా దినోత్సవం  శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళ గొప్పతనాన్ని వివరిస్తూ, వారికోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను రెండు పేజీలలో వివరిస్తూ లేఖ పంపారు. ప్రధాని నుంచి తనకు శుభాకాంక్షలు అందడంతో కాజల్ ఆనందానికి ఆవధులు లేకుండా పోయాయి.  ఈ క్రమంలోని కాజల్ ప్రధానిని మెచ్చుకుంటూ ధన్యవాదాలు తెలిపింది. మహిళల్లో సాధికారతను పెంపొందించేందుకు మీరు ప్రవేశపెట్టిన ‘ బేటీ బచావో’, ‘బేటీ పడావో’ , ‘నారీశక్తి’ పథకాలకు ఆకర్షితురాలినయ్యానని తెలిపింది. ప్రధానికి ఎప్పటికీ తన మద్దతు ఉంటుందని వివరించింది.కాజల్ ఈ మద్య ‘అ!’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆలరించింది. మళ్లీ ‘ఎంఎల్ఏ’ చిత్రంతో త్వరలో  అభిమానుల ముందుకు రానుంది.