PM Narendra Modi conveys wishes to YS Jagan on his birthday
mictv telugu

జగన్‎కు మోడీ బర్త్‌డే విషెష్..ట్రెండింగ్‎లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్

December 21, 2022

PM Narendra Modi conveys wishes to YS Jagan on his birthday

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్విట్టర్లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‎లో నిలిచింది. దేశ వ్యాప్తంగా ప్రముఖులు జగన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డికి..ప్రధాని నరేంద్ర మోడీ విషెష్ తెలిపారు.. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు కేంద్ర మంత్రులను ఆయను శుభాకాంక్షులు తెలిపారు. సినీ ప్రముఖులు జగన్‎కు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. హీరో నాగార్జున, విశాల్, బండ్ల గణేష్ ట్విట్టర్ లో సీఎం‎కు హ్యాపీ బర్త్‎డే చెప్పారు.

ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సీఎం బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుతూ నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమాలు, స్కూలు విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు.రెడ్‌క్రాస్‌ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.