కేటీఆర్ ఎక్కడా..  అని వెతికిన  మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ ఎక్కడా..  అని వెతికిన  మోదీ

November 28, 2017

హైదరాబాద్ మెట్రో ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కోసం ప్రధాని మోదీ వెతకడం ఆసక్తి రేకెత్తించింది.  మోదీ మెుదటగా మియాపూర్‌లో పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత మెట్రో స్టేషన్ ప్రారంభించారు. అయితే..  రిబ్బన్ కట్ చేసే ముందు మంత్రి కేటీఆర్ దూరంగా నిలబడి ఉన్నారు. కేటీఆర్ ఎక్కడున్నారని చూసి తన దగ్గరకు రావాలని మోదీ సూచించారు. కేటీఆర్ దగ్గరకు వచ్చిన  తర్వాతే మోదీ రిబ్బన్ కట్ చేశారు.

ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్ , ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఉన్నారు. అనంతరం మియాపూర్ స్టేషన్‌లో మోదీతో  పలువురు మెట్రో రైలుపై ఎల్ అండ్ టీ ప్రదర్శించిన లఘు చిత్రాన్ని వీక్షించారు. తర్వాత వారంతా మియాపూర్ నుంచి కూకట్‌పల్లికి  వెళ్లి మళ్లి మియాపూర్ వచ్చారు.