ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్.. ఆ ముగ్గురి తర్వాత..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్.. ఆ ముగ్గురి తర్వాత.. 

August 13, 2020

 PM  narendra Modi makes another record, becomes longest-serving Indian prime minister of non-Congress .

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త రికార్డు సృష్టించారు. ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన వారిలో నాలుగో స్థానం కైవసం చేసుకున్నారు. కాంగ్రెసేతర ప్రధానుల పేర్లతో ఉండే ఈ రికార్డుల జాబితాలో అత్యధిక కాలం పనిచేసిన నాలుగో ప్రధానిగా నిన్నటి వరకు దివంగత ప్రధాని అటల్ బిహార్ వాజపేయి పేరు ఉండేది. ఆయన 2268 రోజులు ప్రధానిగా ఉన్నారు. ఈ రోజు ఆ రికార్డును మోదీ అధిగమించారు. ఎల్లుండి ఆయన ఎర్రకోటలో ఏడోసారి జెండా ఎగరేయనున్నారు. 

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అత్యధికంగా 17 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు. తర్వాత ఆయన కూతురు ఇందిరా గాంధీ 11 ఏళ్లు పాలించారు. పీవీ ఐదేళ్లు, మన్మోహన్ పదేళ్లు ప్రధానులుగా ఉన్నారు. అత్యధిక కాలం ఈ పదవిని అలంకరించిన కాంగ్రెసేతర ప్రధానిగా వాజపేయి పేరుతో ఉన్న రికార్డు మోదీ సొంతమైంది. ఆయన దేశ 14 వ ప్రధానిగా 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది మే 30న రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టారు.