జవాన్లతో మోదీ దీపావళి సంబరాలు - MicTv.in - Telugu News
mictv telugu

జవాన్లతో మోదీ దీపావళి సంబరాలు

October 27, 2019

PM Narendra Modi reaches Rajouri to celebrate Diwali with troops on LoC in Jammu and Kashmir

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు మిన్నంటాయి. వారివారి కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆడంబరంగా దీపాల పండుగను జరుపుకుంటున్నారు. ఎప్పటిలానే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి కూడా జమ్మూ కశ్మీర్‌ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఆర్మీ అధికారులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మోదీ సైనిక దుస్తులలో ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. బ్రిగేడ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆర్మీ అధికారులతో కరచాలనం చేస్తూ , స్వీట్లు పంచి సందడి చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను మోదీ ట్విటర్‌లో పంచుకున్నారు. ‘దేశ భద్రత కోసం సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేస్తున్నారు. నిరంతరం దేశంకోసం శ్రమిస్తున్న ఆర్మీ అధికారులతో ఈ దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మోదీ మొదటిసారి జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి ఆర్మీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్మీ సిబ్బంది తమ సంతోషాన్నిమీడియాతో పంచుకున్నారు. ‘ప్రధానియే స్వయంగా ఇక్కడికి రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మాతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని ఓ సైనికుడు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.