ప్రధాని మోదీకి శాంతి బహుమతి.. కోటిన్నర నగదు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధాని మోదీకి శాంతి బహుమతి.. కోటిన్నర నగదు

October 24, 2018

మనదేశ ప్రధాని నరేంద్ర మోదీని అరుదైన గౌరవం దక్కింది. ఆయనను సియోల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. భారత దేశ అభివృద్ధి, సామాజిక ప్రగతి కోసం కృషిచేసిందుకు గాను దీన్ని ప్రకటించినట్లు జ్యూరీ సభ్యులు పేర్కొన్నారు. మోదీనామిక్స్ద్వారా ఆయన దేశ ఆర్థిక పురోగతికి చర్యలు తీసుకున్నారని కొనియాడారు. రెండేళ్లకోమారు అందించే ఈ అవార్డును 2018 సంవత్సరానికి గాను మోదీకి అందించనున్నారు.

PM Narendra Modi awarded Seoul Peace Prize 2018  n recognition of his contribution to the growth of the Indian and global economies. PM Modi was credited for 'Modinomics' that the award committee said

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ దీన్ని అందిస్తోంది. అవార్డు కింద 2 లక్షల డాలర్ల నగదు, ప్రసంశాపత్రం అందజేస్తారు. ఈ అవార్డు స్వీకరించడానికి మోదీ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు చెప్పాయి. అవినీతిపై పోరాటం, అంతర్జాతీయ సంబంధాల మెరుగుదల కోసం మోదీ కృషి చేశారని పేర్కొంటూ ఈ అవార్డు ప్రకటించారు. 1300 మంది ఈ అవార్డుకు పోటీ పడగా, మోదీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనను విజేతగా ప్రకటిమన్నారు.