‘ పాకిస్తాన్ ’ ప్రధాని పదవికి బై బై ! - MicTv.in - Telugu News
mictv telugu

‘ పాకిస్తాన్ ’ ప్రధాని పదవికి బై బై !

July 28, 2017

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ పదవికి అనర్హుడని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పనామా కుంభకోణంలో ప్రధాన నిందితునిగా ఖరారు చేస్తూ ఈ తీర్పును వెళ్ళడించింది. తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా పనామా కుంభకోణంలో వాడినట్టు నేరం రుజువయ్యింది. దీంతో అతని పదవికి గండి ఏర్పడింది. ఆరుగురు సభ్యుల జిట్ బృందం జూలై 10న సమర్పించిన నివేదిక ఆధారంగా కోర్టు నవాజ్ షరీఫ్ ను ధోషిగా తేల్చింది. వెంటనే షరీఫ్ పై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని కూడా ఆదేశించింది.

తప్పు చేసినవారు ప్రధాని అయితేనేమీ, దేశాధ్యక్షుడైతేనేమీ చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరనడానికి నవాజ్ షరీఫ్ తాజా పరిణామమే ఉదాహరణ. తక్షణమే ప్రధాని పదవి నుండి తప్పుకోవాలని ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన జడ్జీలు ఆదేశాలు జారీ చేసారు. 1990 లో ప్రధానిగా వున్నప్పుడు లండన్ లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జిట్ విచారణ చేపట్టింది. పోయిన సంవత్సరం విడుదలైన పనామా పత్రాల్లో నవాజ్ పేరు వుండటంతో అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకొచ్చింది. షరీఫ్ పిల్లల పేరిట వున్న ఫాల్తూ కంపెనీల నగదును అక్రమంగా దేశం దాటించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. కోర్టు ఆదేశానుసారం ఆయన ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేసారు. తన స్థానంలో వచ్చే కొత్త ప్రధానికై అత్యవసరంగా భేటీ అయ్యారు. తన సోదరుడినే తన స్థానంలో కూర్చండబెట్టడానికి పావులు కదుపుతున్నట్టు సమాచారం. తమ్ముడికి పోటీగా బరిలో పంజాబ్ ప్రావిన్స్ సిఎం షెహబాజ్ షరీఫ్ తో పాటు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రేసులో వున్నారు.

ఏదేమైనా పాక్ చట్టం మిక్కిలి పారదర్శకతతో ప్రధాని నేరస్థుడని తేలడంతో అతని మెడలు వంచిందనే చెప్పుకోవాలి. చట్టానికెవరూ అతీతులు కారనేది స్పష్టంగా తెలుస్తోంది.