మోదీగారూ. మీ ఫ్రెండ్ అబ్బాస్ అడ్రస్ ఇవ్వండి.. ఒవైసీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కౌంటర్లు విసిరారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్. తన చిన్నతనంలో తనకో ముస్లిం స్నేహితుడు ఉన్నట్లు తన బ్లాగ్ లో రాసుకున్న మోడీని మీడియా ముఖంగా ప్రశ్నించారు అసద్. “ప్రధాన మంత్రి మోదీ గారికి .. ఎనిమిదేళ్ల తర్వాత తన ముస్లిం ఫ్రెండ్ గుర్తుకు వచ్చారు. చాలా సంతోషం. తనకు చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని, అతడు తమ ఇంటికి తీసుకువచ్చాడని, తనతో పాటే తన ఇంట్లే ఉంటూ ఆ పిల్లవాడు స్టడీస్ పూర్తి చేశాడని విన్నాం. అసలు ఇలాంటి ఫ్రెండ్ మోడీకి ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఒకవేళ అతను ఉండి ఉంటే.. ఇస్లామిక్ మతపెద్దలతో పాటు తాను కూడా మాట్లాడే ప్రసంగాలను విని వాటిపై వివరణ ఇచ్చేలా ప్రియమైన మోడీ జీ చర్యలు తీసుకోండి” అని అసద్ కోరారు.
తామేమైనా అబద్దాలు చెబుతున్నామా మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోవాలని చురకలంటించారు. అబ్బాస్ అడ్రస్ ఇస్తే తామే అతని వద్దకు వెళ్తామని , ప్రవక్తపై నుపుర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమా కాదా అన్న విషయాన్ని అతన్ని అడిగి తెలుసుకుంటామన్నారు. నుపుర్ అనుచితంగా మాట్లాడినట్లు అతను అంగీకరిస్తాడని అసద్ అన్నారు.
ఇటీవల ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మోదీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు రాసుకొచ్చారు. తనకు చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికు పక్క ఊర్లో ఓ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే అతని మరణంతో ఆ ఫ్రెండ్ కుమారుడు అబ్బాస్‌ను తమ ఇంటికి తీసుకువచ్చాడని చెప్పారు. తనతో పాటే అబ్బాస్ కూడా తన ఇంట్లోనే పెరిగాడని చెప్పారు. ఈ విషయాలపై అసదుద్దీన్ స్పందిస్తూ.. అసలు ఆ ఫ్రెండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియదని అన్నారు.