ప్రధాని మోదీ చేతుల మీదుగా రూ.75 నాణెం విడుదల.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధాని మోదీ చేతుల మీదుగా రూ.75 నాణెం విడుదల..

October 16, 2020

bgcb

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) సంస్థ 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 రూపాయాల స్మార‌క నాణాన్ని విడుదల చేశారు. ఈ కాయిన్ పై ఎఫ్ఏవో అని రాసి ఉంది. అలాగే ‘సాహీ పోషన్ దేశ్ రోషన్’ అనే స్లోగన్ హిందీలో రాసి ఉంది. ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులోకి రావు. ఇది ఒక ప్రత్యేకమైన కాయిన్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎనిమిది పంట‌ల‌కు సంబంధించిన 17 ర‌కాల బ‌యోఫోర్టిఫైడ్ వెరైటీల‌ను జాతికి అంకితం చేశారు. ఈరోజుని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 

కొన్ని రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 20 నాణేలను విడుదల చేసింది. రూ.20 నాణెం ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.10 నాణాన్ని పోలినట్టు ఉంటుంది. రూ.10 నాణెం లాగే 27 మిల్లీమీటర్ల వ్యాసం ఉండనుంది. ఈ కాయిన్ ఇన్నర్ డిస్క్‌ 75 శాతం కాపర్, 20 శాతం జింక్, 5 శాతం నికెల్‌తో ఉంటుంది. ఔటర్ రింగ్ 65 శాతం రాగి, 15 శాతం జింక్, 20 శాతం నికెల్‌తో ఉంటుంది. కాయిన్‌పై అశోక స్తంభం, నాలుగు సింహాలు, సత్యమేవ జయతే నినాదం ఉంటాయి. ఇంగ్లీష్‌లో ఇండియా అని, హిందీలో భారత్ అని రాసి ఉంటుంది. రూ. 20 నాణేలను రిజర్వు బ్యాంకు తక్కువగా విడుదల చేసింది.