PM to flag off Vande Bharat express train from Secunderabad to Visakhapatnam on Jan. 19
mictv telugu

వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. సికింద్రాబాద్-విశాఖకు 8 గంటలే..ఛార్జీలు మాత్రం..

January 10, 2023

PM to flag off Vande Bharat express train from Secunderabad to Visakhapatnam on Jan. 19

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త. హై స్పీడ్ వందే భారత్ రైలు వచ్చేస్తుంది. ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘వందేభారత్ ఎక్స్‎ప్రెస్’‎ను ప్రారంభించనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖ పట్నం మధ్య పరుగులు తీయనుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోటుంది. వందేభారత్ రైలు పట్టాలెక్కితే రెండు నగరాల మధ్య రాకపోకలు మరింత వేగవంత కానున్నాయి. ప్రస్తుతం విశాఖను చేరుకోడానికి 13-14 గంటలు సమయం పడితే..వందే భారత్ 8 గంటల్లోనే చేరుకుంటుంది. ‘వందేభారత్ ఎక్స్‎ప్రెస్’లకు గరిష్ఠంగా 180 కి.మీ. వేగంతో ప్రయాణించే సామార్థ్యం సొంతం. ఆ స్పీడ్‌ను తట్టుకునే శక్తి ఇప్పుడు ఉన్న ట్రాక్‌లకు లేనందున 130-150 కి.మీ. వేగంతో నడుస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 52 సెకండ్లలో అందుకుంటుంది. అయితే సాధారణ రైలు ఛార్జీలతో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఉంటాయని సమాచారం.

వందే భారత్ రైలులో 16 కోచ్‌లు, 1128 సీట్లు అందుబాటులో కలవు. ఇందులో ఆటోమెటిక్ డోర్స్ ఉంటాయి. జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వైఫై హాట్‌స్పాట్ ఉపయోగించుకోవచ్చు. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లను అమర్చారు. బయోవ్యాక్యూమ్ టైప్ టాయిలెట్స్, దివ్యాంగులకు అనుకూలంగా వాష్‌రూమ్స్ సదుపాయం ఉంటుంది. ప్రతీ కోచ్‌కు ప్యాంట్రీ సదుపాయం ఉంది. ప్రయాణికుల సెక్యూరిటీ నిమిత్తం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చారు.బ్యాక్టిరియా ఫ్రీ ఎయిర్ కండిషన్ సిస్టమ్, కవచ్ ట్రైన్ ప్రొటెక్ట్ సిస్టమ్ ఈ ట్రైన్ ప్రత్యేకతలు. త్వరలో వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ బెర్తులు తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. 500 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల దూరం మధ్య ప్రయాణించే వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ బెర్తులు అందుబాటులోకి వస్తాయి. దేశంలో ప్రస్తుతం 7 వందే భారత్ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.