PM's Brother Prahlad Modi Injured In Car Accident Near Mysuru
mictv telugu

ప్రధాని మోదీ సోదరుడి కుటుంబానికి రోడ్డు ప్రమాదం..

December 27, 2022

PM's Brother Prahlad Modi Injured In Car Accident Near Mysuru

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుటుంబం ప్రమాదానికి గురైంది. మైసూరు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ కుటుం సభ్యులు గాయపడ్డారు. ప్రహ్లాద్ మోదీ తన భార్య, కొడుకు, కోడలు, మనవడితో కలిసి మెర్సిడెస్ బెంజ్ కారులో బండిపురాకు వెళుతుండగా డివైడర్‌ను ఢీకొట్టింది. కడకోల సమీపంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రహ్లాద్ మోదీ మనవడికి కాలు ఫ్రాక్చర్ కాగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో మైసూరులోని జేఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రమాదం జరిగినప్పుడు ఆయన వెంట ఆయన కాన్వాయ్ కూడా ప్రయాణిస్తోంది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినట్లు తెలుస్తోంది. ప్రహ్లాద్ మోదీ ప్రధాని నరేంద్ర మోదీకి తమ్ముడు. దామోదరదాస్ మోదీ, హీరా బెన్ మోదీలకు జన్మించిన ఆరుగురు పిల్లలలో ప్రహ్లాద్ నాలుగోవాడు. ప్రస్తుతం 69 ఏళ్ల ప్రహ్లాద్ మోదీ ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గుజరాత్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ యూనియన్ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు.