Poaching Case Mlas Tight Securiety TS Govt
mictv telugu

ఆ నలుగురికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

November 4, 2022

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ హీట్ పుట్టిస్తోంది. టీఆర్ఎస్ , బీజేపీ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. హై ఓల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది.ఈ కేసులో బాధితులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం టైట్ సెక్యూరిటీ కల్పించింది.

బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బాధితులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్ రెడ్డిలకు రాష్ట్ర ప్రభుత్వం టైట్ సెక్యూరిటీ కల్పించిది. 4+4 గన్ మెన్స్‌తో పాటు బుల్టెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. అంతకుముందే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సెక్యూరిటీ పెంచారు. ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ బయటపెట్టినప్పటి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు జనాల్లోకి రావడం లేదు. ఫస్ట్ మూడురోజులు ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. ఆతర్వాత కేసీఆర్ మునుగోడు సభలో ప్రత్యక్షమయ్యారు. ఆయనతో పాటు వారు స్టేజ్ పై కూర్చున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత శుక్రవారం సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రెస్‌మీట్‌లో కనిపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ వీడియోల్ని కేసీఆర్ రిలీజ్ చేశారు. శనివారం ఈ నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ రోజు జరిగింది ఇదే

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అజీజ్ నగర్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యే కొనుగోళ్ల ఎపిసోడ్‌కు వేదికైంది. బీజేపీలో చేరితే వందల కోట్లు ఇస్తామని రామచంద్రభారతి, సింహయాజి, నందులు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షన్ రెడ్డి లను అప్రోచ్ అయ్యారు. ఈ సమాచారాన్ని పోలీసులకు ఎమ్మెల్యేలు చెరవేశారు. రివర్స్ ట్రాప్ లో రామచంద్రభారతి, నందు, సింహయాజుల్ని పోలీసులు పట్టుకున్నారు.