లాంచ్ అయిన 'పోకో సీ3'.. ధర రూ.7 వేలే! - MicTv.in - Telugu News
mictv telugu

లాంచ్ అయిన ‘పోకో సీ3’.. ధర రూ.7 వేలే!

October 6, 2020

Poco C3 debuts as the most affordable Poco phone

ప్రముఖ చైనీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి సబ్ బ్రాండ్ పోకో తన కొత్త పోకో సీ3 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను రెండు మెమరీ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 10W ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్ బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో ఉన్నాయి. ఇందులో 3 జీబీ ర్యామ్+32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్+64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ లైమ్ గ్రీన్, ఆర్కిటిక్ బ్లూ, మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానుంది. అక్టోబర్ 16 నుంచి ఈ ఫోన్ సేల్ కానుంది.

పోకో సీ 3 ఫీచర్లు

* 6.53 అంగుళాల హెచ్ డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే,

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 

* 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 13+2+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్,

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.