దేశంలోని సామాన్య వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని చైనా కంపెనీ పోకో బడ్జెట్ ఫోన్‌ని లాంఛ్ చేసింది. సీ సిరీస్‌లో ‘పోకో సీ55’ పేరుతో వస్తున్న ఈ ఫోన్‌లో వెనుక 50 పిక్సెళ్ల కెమెరా, ముందు 5 మెగా పిక్సెళ్ల కెమెరాను అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, 6.71 ఇంచుల హెచ్‌డీ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ ఫోన్ 4 జీబీ 64 జీబీ వేరియంట్ ధర రూ. 9 వేల 499.జ అదే 6 జీబీ 128 జీబీ వేరియంట్ ధరను రూ. 10,999గా నిర్ణయించారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు వెయ్యి రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ నెల 28 నుంచి ఫ్లిప్‌కార్ట్ లేదా కంపెనీ వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. కూల్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ రంగుల్లో లభ్యం అవుతుంది.