పోకో M2 వచ్చేసింది.. రూ.10 వేలకే.. - MicTv.in - Telugu News
mictv telugu

పోకో M2 వచ్చేసింది.. రూ.10 వేలకే..

September 8, 2020

Poco M2 With MediaTek Helio G80 SoC, Quad Rear Cameras Launched in India: Price, Specifications

రెండేళ్ల క్రితం పోకో సిరీస్‌లో విడుదల చేసిన మొదటి స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1కు ధీటుగా తాజాగా పోకో ఎం2 ఫోన్ విడుదల అయింది. వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫోన్ రానేవచ్చింది. 5కే బ్యాటరీ సామర్థ్యంతో రూ.10వేలకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. గతంలో వచ్చిన ‘పోకో ఎం2 ప్రో’ కన్నా ఎక్కువ ఫీచర్లతో దీనిని తీసుకొచ్చారు. క్వాడ్ రియర్‌ కెమెరాలు, పెద్ద బ్యాటరీ వంటివి ఈ ఫోన్‌‌కు ఉన్న మరిన్ని ప్రత్యేకతలు. పోకో ఎం2 6జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ.10,999గాను, 6జీబీ/128జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర రూ.12,499గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి పిచ్‌ బ్లాక్‌, స్లేట్ బ్లూ, బ్రిక్‌ రెడ్ వంటి మూడు రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది.

పోకో ఎం2 ఫీచర్స్‌ ఇలా..

-ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ ఓఎస్‌

-గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌

-6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే 

-మీడియాటెక్‌ హీలియో జీ80 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌

-ఐదు కెమెరాలు (వెనక నాలుగు, ముందు ఒక కెమెరా)

-వెనక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా (అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో 8ఎంపీ సెకండరీ కెమెరా, మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరా ఉన్నాయి)

-ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

-5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, 0-50 శాతం ఛార్జింగ్‌కు అరగంట సరిపోతుంది)

-యాక్సీలో మీటర్‌

-గైరోస్కోప్‌

-ప్రాక్సిమిటీ సెన్సార్‌

-ఏంబియెట్ లైట్ సెన్సార్లు తదితర ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలు.