తక్కువ ధరకే 'పోకో ఎక్స్2' స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

తక్కువ ధరకే ‘పోకో ఎక్స్2’ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది..

February 4, 2020

bm

పోకో లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పోకో ఎక్స్2’ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మూడు వేరియంట్లలో పోకో ఎక్స్‌2 మోడల్‌ ఇండియా లంచ్ అయింది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.15,999గా నిర్ణయించారు. ఫిబ్రవరి 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎక్స్‌2 సేల్ ఉండనుంది. మ్యాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ కలర్స్‌లో లభిచనుంది.

పోకో ఎక్స్2 ప్రత్యేకతలు

 

* 6.67 అంగుళాలు డిస్‌ప్లే,

* 6/8 జీబీ ర్యామ్,

* 64జీబీ, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్,

* 64+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా,

* 20+2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్,

* డ్యూయెల్ సిమ్ సపోర్ట్.