భారత మార్కెట్లోకి పోకో ఎక్స్5 ప్రో5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. పొకో ఇండియా తాజాగా పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో పాపులర్ గేమింగ్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జీ, అమొలెడ్ డిస్ ప్లే, 5000ఏంఏహెచ్ బ్యాటరీ,108మెగాపిక్సెల్ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 22,999. ఐసీఐసీఐ కొనుగోలు చేసేవారికి ఈ ఫోన్ రూ. 2000తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999.8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అయ్యింది. ఆస్ట్రాల్ బ్లాక్, హొరైజన్ బ్లూ, పోకో ఎల్లో కలర్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎక్స్5 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్
పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ గురించి చర్చించినట్లయితే 6.67 అంగుళాల ఎక్స్‌ఫినిటీ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోపాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గతేడాది విడదలైన పాపులర్ గేమింగ్ ప్రాసెసర్. ఐకూ జెడ్6 ప్రో, రియల్‌మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, ఐకూ జెడ్5, షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ మొబైల్స్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. రెండేళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని కంపెనీ వెల్లడించింది.
కెమెరా
ఈ కొత్త పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 108-మెగాపిక్సెల్ ISOCELL HM2 మెయిన్ లెన్స్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. కంపెనీ ప్రకారం, వెనుక కెమెరా 30fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, ఇది 120fps వద్ద పూర్తి-HD వీడియోలను రికార్డ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా, స్మార్ట్‌ఫోన్‌లో 67వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ , 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, X-యాక్సిస్ లీనియర్ మోటార్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 వైర్‌లెస్ కనెక్టివిటీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 12-లేయర్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.