Podu tribesmen were forcibly moved by the police
mictv telugu

పోడు గిరిజనులను బలవంతంగా.. మంచిర్యాలలో ఉద్రిక్తత

July 8, 2022

Podu tribesmen were forcibly moved by the police

మంచిర్యాల జిల్లా కోయపోశగూడెంలో గిరిజనులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను ఖాళీ చేయించే ఉద్దేశంతో పోలీసులు వారిని బలవంతంగా తరలించేందుకు సిద్ధపడ్డారు. పొలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారిని అక్కడ్నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా, ఆదివాసీలు పోలీసులపై తిరగబడి కారం చల్లి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి దండేపల్లి స్టేషనుకి తరలించారు. ఈ క్రమంలో గుడిసెను వదిలి రానని పట్టుబట్టిన గిరిజన మహిళను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె బట్టలు చిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ‘గిరిజన బిడ్డలపై మీకెందుకంత కోపం కేసీఆర్ గారు? ధరణి పోర్టల్ ద్వారా ఫాం హౌసులు, బినామీ కంపెనీల కోసం వేల ఎకరాలు ఆక్రమించవచ్చు. కానీ, మా అక్కలు బతకడం కోసం పోడు చేసుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు.