ప్రజాగాయకుడు నిసార్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజాగాయకుడు నిసార్ కన్నుమూత

July 8, 2020

gdghh

ప్రజల కష్టసుఖాలను, తెలంగాణ గుండెచప్పుళ్లను తన పాటలతో ఎలుగెత్తి చాటిన ప్రముఖ తెలుగు కవి, గాయకుడు నిసార్ మహమ్మద్ ఇకలేరు. కరోనా వైరస్‌తో ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆర్టీసీలో కండక్టర్‌గా, డిపో కంట్రోలర్‌గా పనిచేసిన నిసార్ కొన్ని దశాబ్దాలుగా పాటతో ప్రజా ఉద్యమాలకు ఉపునిచ్చారు. కడవరకు కూడా ఆయన ప్రజల కోసమే పరితపించారు. కరోనా విలయంపై పాట రాసి ఆలపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 

నిసార్ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల. చిన్నప్పటి నుంచి ఆయన సమాజం గురించి ఆలోచించేవారు. ప్రజానాట్యమండలి సభ్యుడైన ఆయన ప్రజలను వేధిస్తున్న సమస్యలపై పాటు రాసి పాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన అనేక ధూంధాంలు నిర్వహించారు. గజ్జెకట్టి చిందేశారు. అనేక నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. నిసార్ మృతిని సాంస్కృతిక రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు అని ప్రజాసంఘాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.