రాహుల్ గాంధీపై కవిత ఫైర్.. అప్పుడు ఎక్కడున్నారు? - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ గాంధీపై కవిత ఫైర్.. అప్పుడు ఎక్కడున్నారు?

May 6, 2022

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. ‘రాహుల్‌ కానీ, ఆయ‌న‌ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలు, హక్కులను ప్రస్తావించారో చెప్పాలి. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పోరాడుతుంటే, రాహుల్ అప్పడు ఎక్కడ ఉన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, పెండింగ్ జీఎస్టీ బకాయిల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు’ అని కవిత ప్ర‌శ్నించారు.

ఈరోజు నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజులపాటు పర్యటించనున్న విషయం తెలిసిందే. మొదటగా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ’ సభకు హాజరుకానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను ఇటీవలే కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ప్లెక్సీలతో కట్టి, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో ఎలాంటి ఘర్షణలు గాని, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.