Poison in the grass..61 cows died..Arrested
mictv telugu

గడ్డిలో విషం..61 ఆవులు మృతి..అరెస్ట్

August 11, 2022

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మహమ్మద్ తాహిర్‌ అనే వ్యక్తి గడ్డిలో విషాహారం కలుపడంతో ఏకంగా 61 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేసి, ఘటన సంబంధించిన వివరాలను వెల్లడించారు.

యూపీలోని అమ్రోహా జిల్లా సంతాల్‌పూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. వందలాది ఆవులకు మహమ్మద్ తాహిర్‌ అనే వ్యక్తి నైట్రేట్ కలిపిన దాణాను ఆవులకు దాణంగా వేశాడు. ఆ ఆహారం తిన్న 61 ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని ఆవులు అనారోగ్యంపాలయ్యాయి. దాంతో అతడు పారిపోయాడు. మహమ్మద్ ఆచూకీ తెలిపినవారికి రూ.50,000 బహుమతి ఇస్తామని ప్రకటించాం. సోమవారం సాయంత్రం అదంపూర్ ప్రాంతంలో అతడిని అరెస్టు చేశాం. అతడితోపాటు అరెస్టయిన 12 మందిలో ఈ గోశాల బాధ్యతలను చూస్తున్న గ్రామ అభివృద్ధి అధికారి మహమ్మద్ అనస్ కూడా ఉన్నారు” అని వివరాలను వెల్లడించారు.

బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి రేణు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారత శిక్షా స్మృతి, గోవధ చట్టం, జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించే చట్టం ప్రకారం ఆరోపణలను నమోదు చేశారు. సీఎం యోగి ఆదేశాలుగోవులు మరణిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. గోశాలకు వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి ధరంపాల్ సింగ్‌ను కోరారు.