ఏ ఏటీఎంలో ఏ పాముందో.. వణికించే వీడియో.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏ ఏటీఎంలో ఏ పాముందో.. వణికించే వీడియో..

May 8, 2020

అసలే లాక్‌డౌన్. .జంతుజాలానికి ఎప్పుడూ లేనంత స్వేచ్చ వచ్చేసింది. మనుషుల సందడి కనిపించకపోవడంతో వన్యప్రాణులు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇందుగలవందు లేవన్నట్లు చివరి ఏటీఎంను కూడా ఆక్రమిస్తున్నాయి. ఘజియాబాద్‌లో భయంకర సర్పం ఏటీఎంలో దూరిపోయింది. చూస్తున్న వాళ్లకు వెన్నులో వణుకుపుట్టింది. గోవిందపురంలోని ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో ఈ సీన్ కనిపించింది. ఓ కస్టమర్ దాన్ని చూసి గార్డును అప్రమత్తం చేశాడు. వెంటనే దాన్ని పట్టుకోడానికి ఏటీఎం తలుపు మూసేశారు. అటవీ సిబ్బంది తర్వాత దాని పనిపట్టారు.

మరోపక్క.. ఏపీలోని విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.  కార్పొరేషన్ ఏటీఎం సెంటర్‌లోకి నాగపాము చొరబడింది. జరిగింది. ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి వెళ్లి తలుపు వేశాడు. తర్వాత హిస్ అంటూ సర్పం పడగెత్తింది. అతడు భయంతో బయటికి పరుగులు తీశారు. తర్వాత పాముల పట్టేవాళ్లు దాన్ని తీసుకెళ్లారు.