'Pokiri' shook the box office again. In one day
mictv telugu

మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పోకిరి’..ఒక్కరోజులోనే

August 10, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో ఇప్పటికి, ఎప్పటికి ప్రేక్షకుల మదిలో చెరిగిపోని కొన్ని సినిమాలు ఉంటాయి. అందులో మహేశ్ బాబు హీరోగా, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పోకిరి’ ఒకటి. ఈ చిత్రం విడుదలై కొన్ని ఏళ్లు గడుస్తున్నా..టీవీలో వస్తే ఇప్పటికి పడిపడి చూసేవాళ్లు అనేకమందే ఉన్నారు. అయితే, ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా (ఆగస్ట్ 9) ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో స్పెషల్ షోలు వేశారు. అయితే, ఊహించని విధంగా మరోసారి చిత్రానికి భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని ఆయా థియేటర్ల యాజమానులు వివరాలను వెల్లడించారు.

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా, ప్రకాష్ రాజ్, నాజర్, అశీష్ కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, మహేష్ బాబు కెరీర్‏లోనే అతి పెద్ద సూపర్ హిట్ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అయితే, ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మరోసారి స్పెషల్ షోలు ప్రదర్శించగా, భారీ రెస్పాన్స్ వచ్చింది.

”ఉత్తరాంధ్రలో ఈ మూవీ స్పెషల్ షోకు.. 24 లక్షల 89 వేల 638 రూపాయాల వచ్చాయి. గుంటురు జిల్లాలో మొత్తం 33 షోలు వేయగా.. 13 లక్షలకుపైగా వసూలు అయ్యాయి. కృష్ణ జిల్లాలో మొత్తం 30 షోలు వేయగా..రూ. 10 లక్షలకుపైగా వచ్చాయి” అని ఆయా థియేటర్ల యాజమానులు వివరాలను వెల్లడించారు. మరోపక్క మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతేకాకుండా, డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు.