పెద్దన్న ట్రంప్ ఎడికెళ్లిన రాచ మర్యాదలు..ఎదురొచ్చి షేక్ హ్యాండ్ లు, సలామ్ లు కొడుతుంటారు. కానీ ఒకామె షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ట్రంప్ కే ఝలక్ ఇచ్చింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో హాట్ హాట్ గా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే…
అమెరికా అధ్యక్షులు ట్రంప్, ఆయన భార్య మెలనియా పొలాండ్ పర్యటనకు వెళ్లారు. అఫీషియల్ ఫ్రోటో కాల్ లో పొలాండ్ ప్రెసిడెంట్ అంద్రెజ్ దుడా, ఆయన భార్య కొర్న్ హాసర్ లు ట్రంఫ్, మెలనియా లను కలిశారు. ఇక.. ట్రంప్ వెంటనే పొలాండ్ ప్రెసిడెంట్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఆయన భార్య కొర్న్ హాసర్ కు ఇవ్వబోయే సరికి ఆమె ఆయనను పట్టించుకోలేదు మెలనియా తో చేతులు కలిపింది. అలాగే చూస్తూ ట్రంప్ ఉండిపోయారు మెలనియా కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చి ట్రంప్ కు కొర్న్ హాసర్ షేక్ హ్యాండ్ ఇచ్చింది.
ట్రంప్ ను పొలాండ్ ఫస్ట్ లేడీ ఇగ్నోర్ చేసిందని… ఆయనకు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఆయనను అలా వదిలేసి ఎలా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు దీనిపై పొలాండ్ ప్రెసిడెంట్ అంద్రెజ్ దుడా స్పందించారు. కొర్న్ అసలు ట్రంప్ ను ఇగ్నోర్ చేయలేదని.. ట్రంప్, అయన భార్యతో షేక్ హ్యాండ్స్ చేసిందని, ఫేక్ న్యూస్ ను నమ్మొదంటూ ట్వీట్ చేశారు. ఇక.. ఈ షేక్ హ్యాండ్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=Ci3tY9ftKC8