రూ. 1000 ఫైన్‌కు 10 కడితే చాలు.. పోలీసుల బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 1000 ఫైన్‌కు 10 కడితే చాలు.. పోలీసుల బంపర్ ఆఫర్

May 2, 2022

కరోనా లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై నమోదైన కేసులు విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై విధించిన రూ. 1000 జరిమానాను భారీగా తగ్గించారు. ఒక్కో కేసుకు కేవలం పది రూపాయలు మాత్రమే కట్టి కేసులను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆఫర్ మే 2 నుంచి మే 8 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో వచ్చిన భారీ స్పందనను చూసి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మొదటి, రెండో లాక్ డౌన్ సమయంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద దాదాపు 3 లక్షల కేసులు నమోదయ్యాయి. వాటిని క్లియర్ చేసేందుకు పోలీసులు ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.