తెలంగాణ నుంచి గుజరాత్ రాష్ట్రానికి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఈ ఘటన చోటు చేసుకోగా, వివరాలను సీఐ భూపతి మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్, నల్గొండ జిల్లా చౌటుప్పల్ నుంచి అక్రమంగా 56 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఈ మూడు లారీలను హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపైన ఉన్న హుగ్గెల్లి జంక్షన్, అల్గోల్ బైపాస్ జంక్షన్, చిరాగ్ పల్లి చెక్‌పోస్టు వద్ద పట్టున్నాం. దీని విలువ సుమారు రూ. 12 లక్షలుంటుంది. ఈ ఘటనలో బీదర్ జిల్లా చట్నెల్లికి చెందిన షేక్ హుస్సేన్, మహ్మద్ నూర్, కాంబ్లే జైభీమ్లను అదుపులోకి తీసుకున్నాం. బియ్యం యజమానులు పరారీలో ఉన్నారు. లారీలను జప్తు చేసి పౌరసరఫరాల శాఖకు అప్పజెప్పాము’అని వెల్లడించారు. ఈ సోదాల్లో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు.