డామిట్ కథ అడ్డం తిరిగింది.. దెయ్యం ముసుగులో వెర్రి చేష్టలు - MicTv.in - Telugu News
mictv telugu

డామిట్ కథ అడ్డం తిరిగింది.. దెయ్యం ముసుగులో వెర్రి చేష్టలు

November 12, 2019

విదేశాల్లో ఫ్యాషన్‌గా మారిన ఫ్రాంక్ మనదేశంలో కూడా రోజు రోజుకూ విస్తరిస్తోంది. అయితే ఇలాంటి చేష్టలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా వెర్రివేషాలు వేసి ప్రజలను భయపెట్టాలని అనుకున్న కొంత మంది యువకులు కటకటాల పాలయ్యారు. దెయ్యం ముసుగు వేసి ఫ్యాంక్ చేద్దామని అనుకొని అడ్డంగా బుక్కయ్యారు. వీరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

Students Dressed.

యశ్వంతపుర్‌లో కొంత మంది విద్యార్థులు దెయ్యం ముసుగు ధరించి ప్రజలను భయపెట్టాలని చూశారు. దీన్ని వీడియో తీసి పాపులర్ అవుదామని స్కెచ్ వేశారు. ఆదివారాలు వచ్చాయంటే చాలు రాత్రి వేళల్లో రోడ్లపైకి వచ్చి రోడ్డుపై వెళ్లే వారిని బెదిరిస్తూ ఉన్నారు. తెల్లటి దుస్తులు ధరించి, జుట్టు విడిచి, రక్తపు మరకలతో భయపెట్టేవారు. ఈ క్రమంలో చాలా మంది కిందపడిపోయి గాయాలపాలయ్యారు. ఈ విషయం తెలిసిన పోలీసులు  ఏడుగురు విద్యార్థుల అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఎవరైనా ఫ్రాంక్ వీడియోల పేరుతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ శశికుమార్‌ తెలిపారు.