సీఎం కేసీఆర్‌కు పార్శిల్స్ పంపిన వ్యక్తి అరెస్ట్
ఈ నెల 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ కవిత పలువురు రాజకీయ నాయకులకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి పార్శిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మొదట అవి ప్రమాదకర రసాయనాలు అనుకొని పరీక్షలు చేయగా… మురుగు నీరు అని తేలింది. తాజాగా ఈ పార్శిల్స్ పంపిన వ్యక్తిని పోలీసులు సీసీ కెమేరాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు.
నిందితుడు సికింద్రాబాద్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడి తల్లిదండ్రులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు 62 కాటన్ బాక్స్‌లను బుక్ చేసి వాటిలో మురికి నీళ్లతో నింపిన బాటిల్స్ ఉంచాడు. వాటిని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ కవిత ఇళ్ల చిరునామాలకు చేరే విధంగా పోస్ట్ చేసాడు. అయితే ఈ బాటిల్స్ నుండి దుర్వాసన రావడాన్ని గమనించి సికింద్రాబాద్ పోస్టల్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మంగళవారం సాయంత్రం ఈ బాటిల్స్ నుండి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. కాగా, బాటిల్స్‌లో ఉన్న లిక్విడ్ మురుగు నీరు అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమికంగా తేల్చింది.