భక్తులతో పియ్యి తినిపించిన బాబా... వాసన రాదట - MicTv.in - Telugu News
mictv telugu

భక్తులతో పియ్యి తినిపించిన బాబా… వాసన రాదట

May 12, 2022

భక్తులకు తన మల, మూత్రాలే ప్రసాదమని, అవి స్వీకరించిన వారికి అన్ని రోగాలు నయమవుతాయని ఓ దొంగ బాబా నమ్మబలికాడు. అతని మాటలు విన్న వెర్రిజనం గొర్రెల్లాగా ఆ బాబా మహిమాన్వితుడని , అతడు ఇచ్చే ప్రసాదం సర్వరోగనివారిణిగా పనిచేస్తుందని అతని దర్శనం కోసం ఎగబడ్డారు. పైగా ఆ మలాన్ని(ప్రసాదం) పవిత్ర హృదయంతో స్వీకరిస్తే వాసన రాదట. ఎవరైతే అనుమానంతో స్వీకరిస్తారో వారికే కంపు కొడుతుందట. ఇలాంటి దొంగ బాబాలు మన దేశంలో చాలా ఫేమస్. కాకపోతే ఈ జరిగింది మన దేశంలో కాదు, థాయ్‌లాండ్‌లో.

తావీ నన్రా (75) అనే బాబా తన మల, మూత్రాలు ఔషధంలా పనిచేస్తాయని, రోగాలు మాయం చేస్తాయని చేసిన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఎంతలా అంటే ఆ బాబానే నమ్మశక్యం కాలేనంతగా. స్వామిజీ మలమూత్రాలను స్వీకరించేందుకు జనం ఎగబడడం చూసి సంబరపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈల విచారణలో భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్వామిజీ ఆశ్రమంలో 11 శవాలు లభించాయి. వాటిలో 5 శవాలకు మాత్రమే డెత్ సర్టిఫికెట్స్ ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
ఆ శవాలు ఎవరివి, అక్కడ ఎందుకు ఉన్నాయనే అంశాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. దీంతో తావీ నన్రాను తాము అరెస్ట్ చేశామన్నారు. అయితే అతడి మల, మూత్రాలను భక్తులు స్వీకరిస్తున్నారని తెలిసి తమకు చాలా ఆశ్చర్యం వేసిందని.. ఇలాంటివి ఎలా విశ్వసిస్తున్నారో అర్ధం కావడం లేదని అభిప్రాయపడ్డారు.