అనసూయ భరద్వాజ్.. తెలుగు బుల్లితెరలో ఒక సెన్సేషన్. ఆపై నటిగా మారి వరుస హిట్స్ తో దూసుకెళ్తుంది. అయితే సినిమాలు, టీవీ షోస్ కంటే వ్యక్తిగతంగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది అనసూయ. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ పై విమర్శలను ఎదుర్కొంటు ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఎక్కడ అనసూయ తగ్గదు. ట్రెండ్ కి తగ్గట్టు రెడీ అయిపోతుంది. దాంతో ఆమెని వ్యతిరేకించే ఒక వర్గం నెటిజన్స్ టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే మొన్న ఆగస్టు నెలలో తనపై ట్రోలింగ్ శృతి మించిందని సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చింది అనసూయ. ట్విట్టర్లో నెటిజన్లు తనని ‘ఆంటీ.. ఆంటీ’ అంటూ వేధిస్తున్నారని పేర్కొంది. అయితే సోషల్ మీడియాలో ఆంటీ అన్న వ్యక్తికీ డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది అనసూయ. నకిలీ ఖాతాను ఉపయోగించి సోషల్ మీడియాలో అనసూయపై అసభ్యకరమైన చిత్రాలని పోస్ట్ చేస్తున్నాడని సీరియస్ అయ్యింది. అనసూయ అసభ్యకరమైన ఫోటోలు, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్న మరో నిందితుడు పండరి రామ వెంకట వీర్రాజును అరెస్టు చేశారు.
నిందితుడు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందినవాడని పోలీసులు వెల్లడించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా పలువురు సినీ నటులు, యాంకర్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి.. అసభ్యకరమైన రాతలు పోస్టులు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నకిలీ ఖాతాతో వేధిస్తున్న ఈ వ్యక్తి అనసూయని ఎందుకు వేధిస్తున్నాడు.. ఇతని వెనుక ఎవరున్నారు అనే యాంగిల్ లో కూడా విచారణ చేస్తున్నట్టు సమాచారం. సాయి రవి 267” అనే ట్విట్టర్ ఖాతా ద్వారా హీరోయిన్లు, యాంకర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్న ఫోటోలను పోస్ట్ చేసేవాడు. అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, ప్రగతి, జయవాణి వంటి సెలబ్రిటీల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో దుబాయ్ లో ప్లంబర్ గా వర్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇదికూడా చదవండి :సినిమాలకు స్వస్తి.. సాయిపల్లవి సంచలన నిర్ణయం ?