పర్స్ కొట్టేస్తూ పట్టుబడ్డ సినీ నటి, అరెస్ట్.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్ - MicTv.in - Telugu News
mictv telugu

పర్స్ కొట్టేస్తూ పట్టుబడ్డ సినీ నటి, అరెస్ట్.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్

March 14, 2022

02

ఓ సినీ నటి దొంగతనం చేస్తూ పోలీసులు దొరికిపోయింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. కోల్‌కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్‌లో బెంగాలీ నటి రూపా దత్తా వ్యక్తుల దృష్టి మరల్చి వారి పర్సులు కొట్టేసేది. ఇలా కొట్టేసిన పర్సులను ఖాళీ చేసిన తర్వాత వాటిని అక్కడి చెత్త కుండీలలో విసిరేసేది. ఇలాగే కొట్టేసిన పర్సును చెత్త కుండీలో వేస్తుండగా గమనించిన స్థానిక పోలీసులు రూపాను అదుపులోకి తీసుకుని విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్తుండడంతో గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఆమె వద్దనున్న బ్యగ్‌ను తనిఖీ చేయగా, అందులో రూ. 75 వేల నగదుతో పాటు మరికొన్ని పర్సులున్నాయి. దీంతో రూపాతో పాటు ఇంకెవరైనా చోరీలలో భాగస్వాములుగా ఉన్నారా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రూపా దత్తా సీరియల్ నటి. తన నటనతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంఘటనతో టాలీవుడ్ ( బెంగాలీ చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అనే పిలుస్తారు) ఉలిక్కిపడింది.